రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

బత్తలపల్లి మండలం వేల్పుమడుగు మలుపు వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గంటాపురానికి చెందిన జయరాములు, అనితమ్మ హిందూపురం వెళ్తుండగా, ధర్మవరం పట్టణానికి చెందిన నారాయణస్వామి బత్తలపల్లి వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో రెండు బైకులు ఢీకొనడంతో వారు కిందపడి గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్