రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి మృతి

ధర్మవరం పట్టణంలోని పార్థసారథినగర్ వద్ద శుక్రవారం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో కొండన్న (86) అనే వృద్ధుడు మృతిచెందాడు. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన కొండన్న ధర్మవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతణ్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్