పామిడి పట్టణంలో భావసారా క్షత్రియ భజన మండలి నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో టి.కె. జగదీష్ అధ్యక్షులుగా, కె. మురళీ సుందర రావు ఉపాధ్యక్షులుగా, టి. చంద్ర మోహన్ రావు కార్యదర్శిగా, పి. నరేష్ రావు సహాయ కార్యదర్శిగా, రవి కోశాధికారిగా ఎన్నికయ్యారు. కుల పెద్దలు జె. శ్రీనివాసరావు, టి.టి. నాగభూషణం, రాజేంద్ర ప్రసాద్ నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. వీరు మరాఠి అభంగాలు పాడడంలో దిట్టలు అని తెలిపారు.