గుత్తి: జింకల దాడిలో దెబ్బతిన్న నిమ్మ మొక్కలు

గుత్తి మండలం మార్నేపల్లిలో జింకల దాడితో నిమ్మ మొక్కలు దెబ్బతిన్నట్లు రైతు రాము తెలిపారు. 8 నెలల వయసున్న సుమారు 30 మొక్కలు జింకల దాడిలో దెబ్బతిన్నాయని వివరించారు. జింకలు గుంపులు, గుంపులుగా తోటల్లోకి ప్రవేశించి నిమ్మ మొక్కలను నాశనం చేశాయని వాపోయారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి జింకలను బంధించి, అడవి ప్రాంతంలో వదిలి పెట్టాలని రైతుల కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్