ఉదయం గుంతకల్ పట్టణంలోని 7, 8, 10, 23 సచివాలయాల వద్ద ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి యస్. హరి ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, అంగవైకల్యాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు అరుణ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.