అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్లలో ఆవు బీభత్సం సృష్టించింది. పెన్షన్ కోసం సచివాలయం వెళ్తున్న నెట్టికంటమ్మ అనే వృద్ధురాలిపై ఆవు దాడి చేయడంతో ఆమె తీవ్రగాయాలతో మృతి చెందింది. మరికొందరిపై దాడికి యత్నించిన ఆవును చూసి స్థానికులు పరుగులు తీశారు. ఆవు కూడా పరిగెత్తి పరిగెత్తి కిందపడి చనిపోయింది. ఇటీవల ఆవును పిచ్చి కుక్క కరిచిందని గ్రామస్తులు చెబుతున్నారు.