గుత్తి జడ్పీ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి శుక్రవారం తనిఖీ చేశారు. స్టోర్ రూమ్లో గడువు ముగిసిన రాగి పిండి ప్యాకెట్లను చూసి ఆమె ప్రిన్సిపాల్ను నిలదీశారు. భోజనం నాణ్యతగా వండాలని హెచ్చరించారు. హెచ్ఎం సుంకన్న పొరపాటు జరిగిందని, వాటిని ఉపయోగించడం లేదని చెప్పగా, వెంటనే ప్యాకెట్లను బయట పారవేయాలని ఆదేశించారు. పిల్లల భోజనం నాణ్యతను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు.