గుంతకల్లు: ఎద్దు పొడవడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

గుత్తి తాలూకా పెద్దవడుగూరు మండలం కాసేపల్లె గ్రామంలో నిర్వహించిన సుంకులమ్మ తిరుణాలలో ఒక వ్యక్తిని ఎద్దు పొడవడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తిరుణాలలో ఓ వ్యక్తిపై అనుకోకుండా ఎద్దు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్