అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుంతకల్లు మండలం కసాపురం సమీపంలోని హెచ్ ఎన్ఎస్ఎస్ కాలువ వద్ద నంచర్లకు వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కసాపురం పోలీసులు గురువారం తెలిపారు. కసాపురం గ్రామానికి చెందిన సోమిరెడ్డి పొలంలో మృతదేహం వెలుగు చూసిందన్నారు. మృతుడి ఒంటిపై నలుపు, తెలుపు చుక్కలున్న అంగీ ఉందని, వయస్సు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. కసాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్