గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలో గురువారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బ్రహ్మయ్య, దుర్గాప్రసాద్, హనుమంతు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని 108 అంబులెన్స్లో గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనంతపురం రెఫర్ చేశారు. తాడిపత్రి నుంచి గుత్తికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.