గుత్తి: తాళం వేసిన ఇంటిలో చోరీ

గుత్తి ఆర్ఎస్ లోని తోళ్ల షాపు కాలనీలో నివాసముండే గోవిందు అనే వ్యక్తి ఇంటిలో బుధవారం చోరీ జరిగింది. దొంగలు తులం విలువైన బంగారు ఉంగరంతో పాటు రూ. 20 వేలు నగదు ఎత్తుకెళ్లారు. గోవిందు పనిమీద ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళాడు. ఈ క్రమంలో బీరువాలో దాచి ఉంచిన బంగారు ఉంగరం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్