గత ప్రభుత్వంలో జారీ చేసిన 36 జీవో నంబరు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయ సమీపంలో మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు శుక్రవారం చేపట్టారు. ఈ దీక్షలకు సీఐటీయు నాయకులు మద్దతు తెలిపారు. సీఐటీయూ నాయకులు సాకే రమేశ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.