గుత్తి మండలం కరిడికొండ గ్రామ సమీపంలోని కొండ గుట్టల్లో పెద్ద పులుల సంచరిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున పెద్దపులులు సంచరిస్తున్న దృశ్యాలను చూసిన ఓ లారీ డ్రైవర్ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తులు కోరుతున్నారు.