అనంతపురం జిల్లా గుత్తి మండలం టి. కొత్తపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకును మరో బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో యాడికి మండలం కోనుప్పలపాడుకు చెందిన నరేశ్, రామాంజినమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.