గుంతకల్ పట్టణంలోని రాజేంద్రప్రసాద్ పురపాలక ప్రాథమిక పాఠశాల, డాక్టర్ రాజేంద్రప్రసాద్ పురపాలక ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎస్. హరి ప్రసాద్ యాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు శుచిగా, రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.