పామిడిలో హిందూ సామ్రాజ్య దినోత్సవం: శివాజీ సేవలకు RSS నివాళి

పామిడి పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సరస్వతి విద్యామందిరంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో, భారత దేశంలో హిందూ సామ్రాజ్య విస్తరణ, హిందూ కుటుంబాల సంరక్షణకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన సేవలను RSS జిల్లా సహా ప్రచారక్ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వీరాంజనేయులు, ఖండ ప్రచారక్ విశ్వనాధ్ పాల్గొన్నారు. తొలుత శివాజీ విగ్రహానికి పుల్లమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్