అదుపుతప్పి ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పామిడి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో అనంతపురంలోని అశోక్ నగర్ కు చెందిన సుమంత్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వ్యక్తిని పామిడి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.