మాదకద్రవ్యాల నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ, డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమాల్లో విశేష సేవలు అందించిన అనంతపురం జిల్లా ఈగల్ సెల్ అధికారి హనుమంతుకు రాష్ట్ర స్థాయి ఈగల్ ఎక్సలెంట్ అవార్డు లభించింది. హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా ఆదివారం ఆయన సర్టిఫికెట్‌తో పాటు అవార్డును అందుకున్నారు. విద్యార్థులు, యువతను అప్రమత్తం చేసేందుకు జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు.