గుత్తి మండలం మార్నేపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో కీర్తన అనే వివాహిత ఆదివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను గుత్తి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.