అమరాపురం మండల కేంద్రంలో చింతకట్టెలు విరిచేందుకు చెట్టు ఎక్కిన కురుబ లింగప్ప (78) ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అతడిని బంధువులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై అమరాపురం ఎస్సై ఎస్ కే వలీబాషా కేసు నమోదు చేశారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు.