కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర వాసి మృతి

బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో లేపాక్షి మండలానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. లేపాక్షి మండలం గలిబిపల్లికి చెందిన రమేశ్(28) బెంగళూరులో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. గురువారం ద్విచక్ర వాహనంలో పనులకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిన పడాల్సి వచ్చింది.

సంబంధిత పోస్ట్