శనివారం గోరంట్లలో ఫోన్ పే చేస్తున్నట్లు నటించి, రూ.40వేల విలువైన సిగరెట్ బండిళ్లను దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంలో వచ్చి, సిగరెట్లు కొనుగోలు చేసి, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపుతామని చెప్పి, దుకాణదారుడు చూసుకునేలోపు పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.