హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఆదివారం పెనుకొండ మండలం గౌని మేకలపల్లి గ్రామంలో పర్యటిస్తారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎంపీ గ్రామానికి చేరుకొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఓ ప్రకటనలో తెలిపారు.