హిందూపురంలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

ఐదుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను హిందూపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 7 కేజీల గంజాయితో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వీ.రత్న హిందూపురం పోలీసు స్టేషన్ చేరుకుని కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గంజాయి అమ్మకాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్