అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముదిగుబ్బకు చెందిన ఆశాభి రాత్రి మరణించింది. వైద్యుల నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మృతురాలి బంధువులను పరామర్శించి, ప్రభుత్వం ఆశాభి కూతురిని ఆదుకోవాలని కోరారు. 10 ఏళ్ల క్రితం భర్త మరణించగా, ఇప్పుడు ఆశాభి మృతితో వారి 9వ తరగతి చదువుతున్న కూతురు అనాధగా మిగిలింది.