నంబులపూలకొంట మండలంలోని దిన్నెమీదపల్లి హరిజనవాడ కాలనీలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో తిరుమలయ్య ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.2.80 లక్షల నగదు, మూడు తులాల బంగారం కాలి బూడిదయ్యాయి. కుమార్తె వివాహం కోసం దాచుకున్న డబ్బులు కాలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దారు దేవేంద్రనాయక్, ఎస్పై వలిబాషా ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.