శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ తహసీల్దార్ శ్రీధర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా, రూ.55 లక్షల నగదు, 221 గ్రాముల బంగారం, 685 గ్రాముల వెండి, రూ.24 లక్షల బ్యాంకు డిపాజిట్లు, పలు ఇళ్ల పత్రాలు లభ్యమయ్యాయి. నిందితుడిని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.