హంద్రీనీవా కాలువలో పడి విద్యార్థి మృతి

సోమందేపల్లి మండల కేంద్రం సమీపంలోని హంద్రీనీవా కాలువలో సమీర్ (18) అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృతి చెందాడు. హిందూపురం హస్నాబాద్ కు చెందిన సమీర్ స్నేహితులతో కలిసి కాలువలో దిగగా, ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహం కోసం గాలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్