గురువారం పరిగి సమీపంలోని పన్నాడమ్మా దేవాలయం వద్ద వరి తవుడు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. మలుపు వద్ద లోడు అధికమవడంతో వాహనం నియంత్రణ కోల్పోయి పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటన హిందూపురం వైపు వెళ్తుండగా చోటుచేసుకుంది.