అనంత: రైలు కిందపడి మహిళ ఆత్మహత్యాయత్నం

రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన ఓ మహిళను హిందూపురం పోలీసులు శనివారం రక్షించారు. కుటుంబ కలహాల వల్ల అనంతపురం చెందిన వీరాచారి భార్య శాంత హిందూపురం వచ్చి ఆత్మహత్య చేసుకో పోయింది. అక్కడున్న స్థానికులు గమనించి 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు స్పందించిన పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆమెను రక్షించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ సిబ్బంది ఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్