కదిరి పట్టణంలో మంగళవారం చైన్ స్నాచింగ్ ముఠా రెచ్చిపోయింది. మగ్గాల క్వార్టర్స్ కు చెందిన శాంతి అనే మహిళ నడుచుకుంటూ వెళుతుండగా స్కూటీపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని చైన్ ను లాక్కొని పారిపోయారు. అదేవిధంగా, రమణమ్మ అనే మరో మహిళ మెడలో సైతం చైన్ స్నాచర్లు చైన్ లాక్కెళ్లారని సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.