నంబులపూలకుంట మండలం మేకలచెరువు పంచాయతీ కటకం వారిపల్లిలో గురువారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటి పనుల విషయంలో తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన 14 ఏళ్ల బాలిక బాత్రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.