కదిరి: ముగ్గురిపై దాడి

కదిరిపట్టణం పిల్లవంకకాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం శాంతమ్మ అనే మహిళ, ఆమె కుటుంబసభ్యులపై రమణ అనే వ్యక్తి కర్రతో దాడి చేసి గాయపరిచిన ఘటనలో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతమ్మ, రమణల మధ్య గతంలో గొడవలున్నాయని, అడ్డుకోవడానికి ప్రయత్నించిన శాంతమ్మ తల్లిదండ్రులు అంజి, నప్ప, అంజినమ్మలపై కూడా దాడి జరిగిందని బాధితులు పోలీసులకు తెలిపారు. గాయపడిన ముగ్గురిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమణపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్