కదిరి: బాలికపై తండ్రి, మేనమామ లైంగిక దాడి

కదిరి నియోజకవర్గంలోని ఓ మండలంలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికపై కన్నతండ్రి, మేనమామ లైంగిక దాడి చేయడంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక అనారోగ్యంతో ఉండటంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు చికిత్స చేయించగా అసలు విషయం బయటపడింది. సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగిందని బాలిక ఉపాధ్యాయులకు తెలిపింది. ఐదు రోజుల క్రితం జిల్లా అధికారి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బాలికను కుటుంబ సభ్యులు బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారని ఉపాధ్యాయులు తెలిపారు.

సంబంధిత పోస్ట్