కదిరి: గంజాయి విక్రేతలను రోడ్డుపై నడిపించుకుంటూ..

కదిరిలో గంజాయి విక్రయిస్తే పోలీసుల మార్క్ ఎలా ఉంటుందో చూపిస్తామని డీఎస్పీ శివనారాయణ స్వామి హెచ్చరించారు. శుక్రవారం గంజాయి అమ్ముతున్న నలుగురిని అరెస్టు చేసి, వారిని పట్టణ రోడ్లపై నడిపిస్తూ స్టేషన్‌కు తరలించారు. గంజాయి అమ్మినా, తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. గంజాయిపై పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్