కదిరి టౌన్ కుమ్మరోళ్లపల్లి గ్రామంలో వల్లపు సోమశేఖర్(42) అనే వ్యక్తి ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సీఐ నారాయణ రెడ్డి అందించిన వివరాలు మేరకు.. సోమశేఖర్ కూలి పని చేసుకుని జీవనం చేస్తూ కుటుంబ కలహాలతో మద్యానికి బానిసై తీవ్ర మనస్తాపం చెంది వాళ్ళ అమ్మ ఇంటిలో ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెందినట్లు తల్లి వల్లెపు మునెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.