కదిరి పట్టణ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేశారు. పట్టణంలో రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. కదిరి డీఎస్పీ శివనారాయణ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోనేరు సమీపాన ఏటివద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ అరెస్టులు జరిగినట్లు తెలిపారు.