కదిరిలో కత్తులతో దాడి.. ఇద్దరికి గాయాలు

కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. కుటాగుళ్ల రైల్వే గేట్ సమీపంలోని భవాని హోటల్ వద్ద జరిగిన ఈ సంఘటనపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. గాయపడిన నవీన్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. సీఐ నారాయణరెడ్డి ఇరువైపుల ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్