కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన వైద్య చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 29వ తేదీన సుమారు 4.4 కిలోల బరువున్న శిశువుకు వైద్యులు వాక్యూమ్ సాంకేతికత ద్వారా నార్మల్ డెలివరీ చేశారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ అవసరమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వైద్య బృందం నైపుణ్యంతో సురక్షితంగా ప్రసవం చేయడం జరిగిందని ఆసుపత్రి సూపరిండెంట్ షేక్ హుస్సేన్ తెలిపారు.