ఇదేందయ్యా ఇదీ..

శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం రెక్కమానులో అభివృద్ధి పనుల పేరుతో వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. కదిరి-రాయచోటి ప్రధాన రహదారికి ఆనుకొని నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభాన్ని ఉంచి పనులు చేయడం గ్రామస్థులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోడ్డు మధ్యలో అడ్డంకులు దాటుతూ వెళ్లడమే ఆధునిక డ్రైవింగ్ అని గ్రామస్థులు సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్