శెట్టూరు మండలం చింతర్లపల్లిలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చెక్ డ్యాం పూర్తిగా నిండిపోయింది. చెక్ డ్యాం సామర్థ్యం కంటే అధికంగా వర్షం నీరు వచ్చింది. దీంతో చెక్ డ్యాం నుంచి వర్షం నీరు పొంగిపొర్లుతోందని రైతులు తెలిపారు. చాలారోజుల తర్వాత భారీ వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యాం వర్షం నీటితో నిండిపోవడంతో చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోర్లలో నీటి శాతం పెరిగి ఉంటుందన్నారు.