దుర్గం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

దుర్గం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంబదూరు మండలం గుద్దెళ్ళ గ్రామంలో ఆదివారం రాధాస్వామి సోమ అజాయిబ్ కృపా ఆశ్రమం నందు ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరంలో 63మంది తమ అమూల్యమైన రక్తాన్ని దానం చేయడం జరిగింది. బాబురామ్ సింగ్ జీ మహారాజ్ ఆశీస్సులతో నిర్వహించిన రక్తదానం శిబిరం విజయవంతమైంది. ఆశ్రమంలో నిర్వహించిన సత్సంగంతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్