కళ్యాణదుర్గంలోని రాఘవేంద్ర మద్యం షాపు నిర్వాహకులకు, ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులకు మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన టెండర్లలో ఓ వ్యక్తి మద్యం షాపును దక్కించుకున్నాడు. రాఘవేంద్ర పేరుతో మద్యం షాపును ఏర్పాటు చేశారు. అయితే మద్యం షాపును తమకు వదిలివేయాలని ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే షాపు నిర్వాహకులు, ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల సమక్షంలోనే ఘర్షణ పడ్డారు.