కళ్యాణదుర్గం: దొంగ బంగారం కలకలం - కంబదూరులో దుకాణాలు మూత

శనివారం కంబదూరులో దొంగ బంగారం కలకలం రేగడంతో, బంగారు దుకాణాలన్నీ మూసివేశారు. సత్యసాయి జిల్లా పోలీసులు కంబదూరు మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తిని, పేరూరు గ్రామంలోని బంగారు దుకాణం యజమానిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు దొంగ చెప్పిన సమాచారం ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయని, దీంతో కంబదూరు మండల కేంద్రంలో బంగారు షాపు యజమానులు భయబ్రాంతులకు గురై దుకాణాలను మూసివేశారని సమాచారం. కంబదూరు పోలీసులు, సత్యసాయి జిల్లా పోలీసులకు సహకారం అందిస్తూ మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్