కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో వన్నూరుస్వామి అనే రైతుకు చెందిన 2మేకలపై శనివారం రాత్రి చిరుత దాడి చేసి చంపేసిందని బాధితులు వాపోయారు. కొద్దిరోజుల క్రితం ఇదే గ్రామంలో ఆవులపై చిరుత దాడి చేసి చంపిన ఘటన మరవకముందే అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా దీనిపై చొరవ చూపాలని కోరారు.