కంబదూరు మండల కేంద్రంలోని దుర్గం కొండ క్వారీ వద్ద బుధవారం చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను చూసిన చుట్టుప్రక్కల రైతులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమీపంలోని పొలంవద్ద మేత మేస్తున్న మేకపై చిరుత దాడి చేసి ఎత్తుకెళ్లినట్లు రైతులు తెలిపారు. రైతులు మాట్లాడుతూ పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికే చిరుత దాడుల వల్ల చాలా పశువులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.