కళ్యాణదుర్గం పట్టణలోని దొడగట్ట రోడ్డులో నివాసం ఉంటున్న వన్నూరుస్వామి అప్పులబాధ తాళలేక శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్లుగా నర్సరీ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. నర్సరీ నిర్వహణకు పలువురితో దాదాపు రూ. 7లక్షల వరకు అప్పులు చేశాడు. నర్సరీ సక్రమంగా జరగక పోవడంతో దిగులుగా ఉండేవాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు పంచెతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.