కళ్యాణదుర్గం పట్టణంలో వెలసిన శ్రీ అక్కమ్మ అమ్మవారి కొండకు రాతి మెట్ల పనులు ఆదివారం పునఃప్రారంభం అయ్యాయి. నియోజకవర్గ ప్రముఖ పారిశ్రామిక వేత్త బెస్తరపల్లి కృష్ణమూర్తి కొండకు మెట్లను తన సొంత నిధులతో నిర్మాణం చేయిస్తున్నారు. రాతి మెట్లు, రెండు పక్కల ప్రహారీని కూడా నిర్మిస్తున్నట్లు కృష్ణమూర్తి తెలిపారు. అక్కమ్మ సేవలో సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు.