కళ్యాణదుర్గం: ఉరివేసుకొని యువతి ఆత్మహత్య

పెళ్లికూతరు కావాల్సిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాప్తాడు మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పూలకుంట గ్రామానికి చెందిన రేణుక ఆకుతోటపల్లి-1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆమెకు కళ్యాణదుర్గానికి చెందిన యువకుడితో ఈ నెల 20న వివాహం జరగాల్సి ఉంది. ఇంట్లో సందడి మొదలవగా యువతికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

సంబంధిత పోస్ట్