కళ్యాణదుర్గం: నాగిరెడ్డిపల్లి సమీపంలో చిరుత మృతి

బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం చిరుత కళేబరం కనిపించింది. స్థానికులు చిరుత మృతి చెందిన విషయాన్ని గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. అనారోగ్యం కారణంగా మృతి చెందిందా? లేక ఇతర కారణాలతో మృతి చెందిందో తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు చిరుత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్